ముత్రవిసర్జన కోసం సౌదీ బస్సు ఆపడం వల్లే ప్రమాదం: బాధితుడు

19చూసినవారు
TG: ఇటీవల జరిగిన సౌదీ బస్సు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికుడు షోయబ్ యాక్సిడెంట్ జరిగిన తీరును వివరించాడు. 'ఓ ప్యాసింజర్ మూత్రవిసర్జన కోసం బస్సును ఆపాడు. అంతలో వెనుక నుంచి వచ్చిన ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. మంటలు అంటుకోగానే డ్రైవర్, నేనూ కిందకు దూకేశాం. మా అమ్మానాన్న, తాత చనిపోయారు. నాకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి సర్కారు ఆదుకోవాలి' అని కోరారు. కాగా ఈ ఘటనలో 45 మంది తెలంగాణ వాసులు ప్రాణాలు కోల్పోయారు.
Video credits: ANI