KTR కన్నెపల్లి పర్యటనలో ప్రమాదం.. ఎమ్మెల్సీకి గాయం

20చూసినవారు
KTR కన్నెపల్లి పర్యటనలో ప్రమాదం.. ఎమ్మెల్సీకి గాయం
TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆయన ఛాతి భాగానికి బలమైన గాయం కావడంతో తీవ్ర నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయనను కొంపల్లిలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్