కొమురంభీం జిల్లాలో పెద్దవాగు రైల్వేబ్రిడ్జి నిర్మాణ పనుల్లో ప్రమాదం జరిగింది. బ్రిడ్జి పైనుంచి జారిపడిన ముగ్గురు కార్మికులు మధ్యలో ఇరుక్కుపోయారు. ప్రమాద స్థలంలోనే రెస్క్యూ టీమ్ వారికి చికిత్స అందిస్తోంది. ఈ ఘటనలో మరో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.