AP: కడప జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో రాయచోటి – కడప ప్రధాన రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గువ్వల చెరువు ఘాట్‌లోని ఐదో మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి, ట్రాఫిక్‌ను మళ్లించారు. రాయచోటి నుంచి వెళ్లే వాహనాలను చక్రాయపేట మార్గం మీదుగా దారి మళ్లించారు. ఈ ఘటనతో ఘటనాస్థలిలో భారీగా వాహనాలు నిలిచిపోయి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.