TG: ఉద్యోగులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు రూ.1.02 కోట్ల ప్రమాద బీమా కల్పించనున్నట్లు వెల్లడించింది. దీంతో 5.14 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ప్రమాద బీమా కల్పించనుంది. దీనిపై బ్యాంకులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించింది. ఇప్పటికే సింగరేణి, విద్యుత్ సంస్థల ఉద్యోగులకు బీమా అమలు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు.