AP: కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన తరుణ్ కుమార్, ఆశాజ్యోతికి నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక బాబు, పాప ఉన్నారు. భర్త స్నేహితుడైన వంశీతో ఆశాజ్యోతికి వివాహేతర సంబంధం ఏర్పడింది. అతనితో కలిసి బతకాలని ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఆమెతో పాటు కుమార్తె హర్షిత (18 నెలలు)ను తీసుకొచ్చింది. విజయవాడ బావాజీపేటలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వంశీతో కలిసి సహజీవనం చేస్తోంది. అయితే ఆశాజ్యోతితో గొడపడిన వంశీ.. ఆమె కుమార్తెను గోడకేసి కొట్టడంతో చిన్నారి మృతి చెందింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.