చిన్నారిపై హత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు (వీడియో)

4672చూసినవారు
TG: చిన్నారిపై లైంగిక దాడి, హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు పడింది. 2024 జూన్ 13న పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో తల్లిదండ్రుల వద్ద నిద్రిస్తున్న చిన్నారిని వినోద్ మాజీ ఎత్తుకెళ్లి లైంగిక దాడి చేసి హత్య చేశాడు. ఈ కేసులో నిందితుడికి పోక్సో ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. సుల్తానాబాద్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి స్వప్నరాణి శిక్ష విధించారు. కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు, కోర్టు డ్యూటీ, లైజన్ అధికారులను రామగుండం పోలీస్ కమిషనర్ అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్