AP: శ్రీ సత్యసాయి జిల్లా, నల్లమాడ మండలంలో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు బండి ఆదినారాయణకు అనంతపురం పోక్సో ప్రత్యేక కోర్టు బుధవారం కీలక తీర్పు ఇచ్చింది. సుదీర్ఘ విచారణ అనంతరం నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష మరియు రూ. 5,000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఈ ఘటన 2020 డిసెంబరులో జరిగింది.