విద్యార్థినిపై యాసిడ్ దాడి.. పోలీసులను బురిడీ కొట్టింటిన యువతి

38చూసినవారు
విద్యార్థినిపై యాసిడ్ దాడి.. పోలీసులను బురిడీ కొట్టింటిన యువతి
ఢిల్లీ యూనివర్సిటీలోని ఓ విద్యార్థినిపై ఇటీవల యాసిడ్ దాడి జరిగిందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సదరు విద్యార్థిని పై యాసిడ్ దాడి జరగలేదని, ఆమె కట్టుకథ అల్లినట్లు ఢిల్లీ పోలీసులు తేల్చిచెప్పారు. దర్యాప్తులో భాగంగా.. సంఘటన స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను పరిశీలించిన తర్వాత, యాసిడ్ దాడికి సంబంధించిన ఘటన నిజం కాదని పోలీసులు నిర్ధారించారు. కొద్ది రోజుల క్రితం, ఒక యువతి తనపై గుర్తు తెలియని వ్యక్తులు కెమెకల్స్ చల్లారని ఫిర్యాదు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్