ప్రముఖ నటుడు బాబు మోహన్ చిల్డ్రన్స్ డే సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన కొడుకు జ్ఞాపకాలతో భావోద్వేగానికి లోనయ్యారు. చిన్నతనంలో పోలీస్ అవ్వాలనే కోరిక, 'జంబలకడిపంబ' సినిమాలో పోలీస్ పాత్రతో కొంతవరకు నెరవేరిందని తెలిపారు. తన కొడుకు చెన్నైలో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు బైక్ ప్రమాదంలో మరణించాడని, ఆ బాధ జీవితాంతం ఉంటుందని కన్నీటి పర్యంతమయ్యారు. కోట శ్రీనివాసరావు కొడుకు కూడా రోడ్డు ప్రమాదంలోనే మరణించారని, తాము ఇద్దరం తరచూ పిల్లల గురించి మాట్లాడుకుంటూ బాధపడేవాళ్లమని తెలిపారు.