రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్, పవిత్రా గౌడ జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో నటుడు దర్శన్ మరింత చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. అప్రూవర్‌గా మారిన ప్రదోశ్ రావు కోర్టులో కీలక విషయాలు వెల్లడించారు. రేణుకా స్వామి ప్యాంటు విప్పి ప్రైవేట్ పార్ట్‌పై దర్శన్ దాడి చేశాడని, ముఖంపై కొట్టారని, నేలపై ఉమ్మి దాన్ని నాకేలా చేశారని ప్రదోశ్ రావు చెప్పినట్లు తెలుస్తోంది.