నటుడు నాగచైతన్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన వ్యక్తిగత హక్కులు, గోప్యతను పరిరక్షించాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తన పేరు, ఫోటోలను అనుమతి లేకుండా దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొంటూ, వాటిని అడ్డుకోవాలని కోర్టును నాగచైతన్య అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై త్వరలో విచారణ జరిగే అవకాశం ఉంది.