నటుడు సోనూసూద్ గుజరాత్‌లోని వారాహి గోశాలను సందర్శించి, అక్కడి గోసంరక్షణ చర్యలను ప్రశంసించారు. కొన్ని ఆవులతో ప్రారంభమై 7,000 ఆవుల సంరక్షణ వరకు ఎదిగిన ఈ ప్రయాణం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమానికి మద్దతుగా తన ఫౌండేషన్ తరపున రూ. 11 లక్షల విరాళం ప్రకటించారు. ఇక్కడ జరుగుతున్న అద్భుతమైన గోసంరక్షణ విధానం దేశమంతటా అమలు కావాలని సోనూ సూద్ ఆకాంక్షించారు.