
మద్యం మత్తులో కొడుకును హత్య చేసిన తండ్రి
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న తండ్రి దయారామ్, తన కుమారుడు మునీష్ను (30) పదునైన ఆయుధంతో పొడిచి హత్య చేశాడు. కుటుంబ విషయమై తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీయడంతో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. కుమారుడి మృతదేహాన్ని ఇంట్లోనే దాచిపెట్టినప్పటికీ, గ్రామస్థులకు విషయం తెలియడంతో పోలీసులకు సమాచారం అందింది. సోదరి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, నిందితుడైన తండ్రి దయారామ్ను అరెస్టు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.




