టాలీవుడ్ యువ నటి భాగ్యశ్రీ భోర్సే తన పుట్టినరోజును అనాథ పిల్లల మధ్య జరుపుకుని అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నారు. ఓ అనాథ ఆశ్రమాన్ని సందర్శించిన ఆమె, పిల్లలతో కలిసి కేక్ కట్ చేయడంతో పాటు, వారితో సరదాగా క్రికెట్ ఆడి సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సినిమాల విషయానికొస్తే, భాగ్యశ్రీ త్వరలో 'లెనిన్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.