ముసలితనం వచ్చేసిందన్న నెటిజన్.. కౌంటరిచ్చిన నటి

7చూసినవారు
ముసలితనం వచ్చేసిందన్న నెటిజన్.. కౌంటరిచ్చిన నటి
మీ వయస్సు పెరిగిపోయింది, ముసలితనం వచ్చేస్తోంది అంటూ SMలో ట్రోల్ చేసిన ఓ నెటిజన్‌కు నటి షమితా శెట్టి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. "అవును, నా వయస్సు పెరిగింది కాబట్టి నేను మారుతాను. కాలంతో పాటు ప్రతిదీ మారుతుంది. శారీరక రూపురేఖలతో సహా ఏదీ శాశ్వతం కాదు. కానీ నా వయసుకు తగ్గట్లుగా నేను ఆరోగ్యంగా, ఫిట్‌గా, సంతోషంగా ఉన్నాను" అని షమితా తెలిపారు. ఇక పెళ్లి చేసుకోలేదంటూ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘పెళ్లి చేసుకొని మీరేం సాధించారు? సింగిల్స్‌ను ఎందుకు ఫాలో అవుతున్నారు’ అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్