నటి కేలి హాటిల్ కన్నుమూత

26948చూసినవారు
నటి కేలి హాటిల్ కన్నుమూత
ప్రముఖ హాలీవుడ్ యువ నటి కేలి హాటిల్ కన్నుమూశారు. మేరీల్యాండ్‌లో జరిగిన కారు ప్రమాదంలో ఆమె చనిపోయారు. 18 ఏళ్ల వయసులోనే కేలి కన్నుమూయడంతో హాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. 'గాడ్జిల్లా వర్సెస్ కాంగ్', 'గాడ్జిల్లా ఎక్స్ కాంగ్: ది న్యూ ఎంపైర్' సినిమాల్లో నటించి ఆమె మంచి గుర్తింపు పొందారు. ఫ్యామిలీ నుంచి ఆమెకు వారసత్వంగా వినికిడి లోపం వచ్చింది. అదే ఆమెకు సినిమా అవకాశాల్ని ఇచ్చింది. ఈ 2 సినిమాల్లో కేలీ వినికిడి లోపం ఉండి సైన్ లాంగ్వేజ్‌తో మాట్లాడే జియా అనే బాలిక పాత్రను పోషించారు.

సంబంధిత పోస్ట్