మలయాళ నటి మమితా బైజు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. ఆమెకు అధిక జ్వరం, ఒంటినొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. వైద్యులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో, ఈ వారం
ఆస్ట్రేలియాలో జరగాల్సిన ఓనం వేడుకల కార్యక్రమానికి ఆమె హాజరు కాలేకపోతున్నారు. ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత మరోసారి
ఆస్ట్రేలియా పర్యటనకు వస్తానని మమితా బైజు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ ద్వారా తెలిపారు.