
నేడు ఖగోళంలో అరుదైన 'బ్లడ్ మూన్' దృశ్యం
నేడు (మార్చి 3) అరుదైన సంపూర్ణ చంద్రగ్రహణం ఆకాశంలో కనువిందు చేయనుంది. భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కమ్మేయడంతో చంద్రుడు ఎరుపు వర్ణంలో కనిపించే ఈ ఘటనను ‘బ్లడ్ మూన్’గా పిలుస్తారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:20కి ప్రారంభమై సాయంత్రం 6:47కి ముగుస్తుంది. భారత్లో చంద్రోదయం తర్వాతే స్పష్టంగా వీక్షణ సాధ్యం. ఢిల్లీ, ముంబై, బెంగళూరు సహా అనేక నగరాల్లో సాయంత్రం 6:20 తర్వాత గ్రహణం కనిపించనుంది.




