పంజాబీ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు: సందీపా విర్క్

7838చూసినవారు
పంజాబీ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు: సందీపా విర్క్
పంజాబీ చిత్ర పరిశ్రమలోని చీకటి కోణాలను బయటపెడుతూ నటి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సందీపా విర్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.6 కోట్ల మనీలాండరింగ్ కేసులో జైలుకు వెళ్లి, ఇటీవల బెయిల్‌పై విడుదలైన ఆమె, ఒక పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో తన జైలు జీవితం, సినిమా షూటింగ్ సమయంలో తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి వివరించారు. ఓ దర్శకుడు తనను లైంగికంగా వేధించాడని, నిరాకరించడంతో సినిమా నుంచి తొలగించాడని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. జైలులో మహిళా ఖైదీల పట్ల ప్రవర్తించే తీరు అవమానకరంగా ఉందని కూడా ఆమె వాపోయారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you