ఉత్తరాఖండ్‌లోని సోన్‌ప్రయాగ్-కేదార్‌నాథ్ మధ్య రోప్‌వే నిర్మించేందుకు ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. ఈ మేరకు కంపెనీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. సోన్‌ప్రయాగ్, కేదార్‌నాథ్ మధ్య సుమారు 12.9 కిలోమీటర్ల పొడవు రోప్ వే నిర్మాణానికి ఈ ఏడాది మార్చిలో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు రూ.4,081 కోట్లు అవుతుందని అంచనా వేసింది.