దేశ జీడీపీ 6.3 శాతానికే పరిమితం!

1211చూసినవారు
దేశ జీడీపీ 6.3 శాతానికే పరిమితం!
అమెరికా, ఇజ్రాయెల్‌-ఇరాన్‌ యుద్ధం కారణంగా భారత జీడీపీ వృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని, ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) జీడీపీ 6.3 శాతానికే పరిమితం కావచ్చని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) ప్రధాన ఆర్థికవేత్త ఆల్బర్ట్‌ పార్క్‌ మంగళవారం తెలిపారు. గతంలో 6.9 శాతంగా అంచనా వేయగా, ఇప్పుడు 0.6 శాతం తగ్గించారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం దేశీయ డిమాండ్‌ను దెబ్బతీయడమే దీనికి కారణమని ఆయన పేర్కొన్నారు. పశ్చిమాసియాలో సంక్షోభం కొనసాగితే ద్రవ్యోల్బణం పెరిగి, ఆర్థిక వృద్ధి రేటు బలహీనపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్