రాష్ట్రంలోని లక్ష 50 వేల నుంచి 2 లక్షల జనాభా కలిగిన పట్టణాలకు అదనంగా ఎమ్మార్వోలను కేటాయిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న తహశీల్దార్ల కొరత వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, ఈ విషయాన్ని కేబినెట్‍లో చర్చించి త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన ఆయన, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు.