TG: ఆదిలాబాద్ రిమ్స్ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్‌కు చెందిన దుర్గబాయి బిడ్డ రిమ్స్‌లో మృతి చెందగా, ఇంద్రవెల్లి మండలం దుబ్బగూడకు చెందిన నాగుబాయి బిడ్డను నిర్మల్‌కు తరలిస్తుండగా మృత్యువాత పడ్డారు. మంగళవారం ముగ్గురు చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే.