
కోల్ గ్యాసిఫికేషన్ పథకంపై వార్తలను ఖండించిన కేంద్రం!
రూ.37,500 కోట్ల బొగ్గు గ్యాసిఫికేషన్ పథకానికి ఆదరణ లేదనే వార్తలను కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ ఖండించింది. TFL, ఎన్టీపీసీల నుంచి దరఖాస్తులు వచ్చాయని తెలిపింది. సెప్టెంబర్ 7న తొలి రౌండ్ ముగియనుంది. ఈ పథకం ద్వారా 25 ప్రాజెక్టులలో ₹2.5-3 లక్షల కోట్ల పెట్టుబడులు, 50 వేల ఉద్యోగాలు వస్తాయని అంచనా. 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ లక్ష్యమని పేర్కొంది.




