ఆదిలాబాద్: దరఖాస్తుకు ఈనెల 15 లాస్ట్

7చూసినవారు
ఆదిలాబాద్: దరఖాస్తుకు ఈనెల 15 లాస్ట్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి (పాటగూడ), ఉట్నూర్, నార్నూర్, సిర్పూర్ కాగజ్‌నగర్ ఏకలవ్య గురుకుల కళాశాలల్లో సీబీఎస్ఈ ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్‌సీవో అగస్టిన్ తెలిపారు. హ్యుమానిటీస్‌లో మిగిలిన సీట్లకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. పదో తరగతి పూర్తి చేసిన అర్హులైన విద్యార్థులు ఈనెల 15వ తేదీలోగా సమీపంలోని కళాశాలల్లో నేరుగా దరఖాస్తు సమర్పించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్