సైబర్ నేరాలపై 10 ఫిర్యాదులు నమోదు: ఆదిలాబాద్ ఎస్పీ

63చూసినవారు
సైబర్ నేరాలపై 10 ఫిర్యాదులు నమోదు: ఆదిలాబాద్ ఎస్పీ
సైబర్ నేరాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. సైబర్ నేరాలకు గురైన వారు వెంటనే 1930 నంబర్ కి సంప్రదించి ఫిర్యాదు చేయాలన్నారు. ముఖ్యంగా సైబర్ నేరాలకు బారిన పడిన గంటలోపు ఫిర్యాదు చేస్తే ఆర్థిక నష్టం జరిగిన వాటిని తిరిగి రప్పించే అవకాశం ఉందన్నారు. గతవారం రోజుల్లో జిల్లాలో దాదాపు సైబర్ నేరాలపై 10 ఫిర్యాదులు నమోదు అయినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్