ఆదిలాబాద్‌లో చాకలి ఐలమ్మ 131వ జయంతి

2చూసినవారు
ఆదిలాబాద్‌లో చాకలి ఐలమ్మ 131వ జయంతి
తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను భారత జాతీయ మహిళా సమాఖ్య ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించింది. శనివారం, సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి ముడుపు నళిని రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు అమీనా ఖాన్ తదితరులు ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి ఎదుట గల ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటం ఆదర్శనీయమని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్