ఆదిలాబాద్ మున్సిపాలిటీ నామినేషన్ ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిసింది. టీటీడీసీ కేంద్రంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో మొత్తం 141 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. వీరిలో బీఆర్ఎస్ నుంచి 35, కాంగ్రెస్ నుంచి 65, బీజేపీ నుంచి 26, ఎంఐఎం నుంచి 2, ఇతరులు 13, స్వతంత్ర అభ్యర్థులు 8 మంది ఉన్నారు. ఇప్పటివరకు మొత్తం 149 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు సమాచారం.