ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పాలవాగుకు చెందిన 12 ఏళ్ల కొట్నక్ లింగు అనే బాలుడి ఎడమ మూత్రపిండంలో దాదాపు 200 గ్రాముల (6 సెం.మీ.) బరువున్న రాయిని వైద్యులు విజయవంతంగా తొలగించారు. గతంలో నొప్పి నివారణ మాత్రలతో ఉపశమనం పొందిన బాలుడికి, మూడు రోజుల క్రితం పాఠశాలలో నొప్పి తీవ్రమవడంతో రిమ్స్‌కు తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మూత్రపిండంలో భారీ రాయిని గుర్తించి, యూరాలజీ వైద్యుడు కె.కార్తిక్‌కుమార్ శస్త్రచికిత్స చేసి తొలగించారు. ఈ రాయి దాదాపు మూడేళ్లుగా బాలుడి మూత్రపిండంలోనే పెరిగిందని వైద్యులు తెలిపారు.