తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు ఇచ్చిన హామీ మేరకు 250 గజాల భూమిని అందించాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పిడమర్తి రవి ఆదిలాబాద్‌లో కోరారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేకే కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి వారిని గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నెల 21న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఉద్యమకారుల సభను విజయవంతం చేయాలని పిడమర్తి రవి పిలుపునిచ్చారు.