శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా, ఆదిలాబాద్ జిల్లాలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా, జిల్లాలో ఉన్న ప్రశాంత వాతావరణం భంగం కాకుండా, సవ్యంగా కొనసాగించడానికి జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. 30 పోలీస్ యాక్ట్ - 1861 అమల్లో ఉన్నందున జిల్లాలో డిఎస్పి లేదా ఆ పై స్థాయి అధికారుల నుండి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ప్రజా సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమి గుడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించరాదని మరియు సన్నాహాలు చేయరాదని తెలిపారు.