ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. శనివారం జరిగిన ఆంగ్ల పరీక్ష సజావుగా ముగిసింది. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి జాదవ్ గణేష్ తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 8,622 మంది విద్యార్థులకు గాను 8,258 మంది పరీక్షకు హాజరయ్యారు, 364 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠమైన నిఘా ఏర్పాటు చేశారు.