రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

నేరేడిగొండ మండలంలోని యూపల్ గూడ గ్రామానికి చెందిన మండాడి భీంరావు (30) అనే యువకుడు రహదారి ప్రమాదంలో శనివారం మృతి చెందాడు. గుత్వాల గ్రామానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో, జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో రివర్స్ తీసుకుంటున్న లారీని అతని ద్విచక్రవాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో భీంరావుకు తీవ్ర గాయాలవడంతో, స్థానికులు అతన్ని నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
