ఆదిలాబాద్: పదవ తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి

76చూసినవారు
ఆదిలాబాద్: పదవ తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మి వాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను డీఈవో ప్రణీత గురువారం సందర్శించారు. ముఖ్యంగా 10వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను పరిశీలించారు. విద్యార్థులను వివిధ విషయాల పట్ల ప్రశ్నించి వారి అవగాహన సామర్థ్యాలను పరీక్షించారు. విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకొని పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంసిద్ధులు కావాలని సూచించారు. సెక్టొరల్ అధికారి నారాయణ ఉన్నారు.

సంబంధిత పోస్ట్