అమాయక రైతులకు రుణాలు ఇప్పిస్తామని, సబ్సిడీలు మంజూరు చేయిస్తామని, వ్యవసాయ పరికరాలు అందిస్తామని, పంటలను అధిక ధరలకు కొనుగోలు చేస్తామని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గత ఏడాది కాలంలో రైతులను మోసం చేసిన దళారులపై 25 కేసులు నమోదు చేయగా, ఈ సంవత్సరం నెల రోజులలోనే 20 కేసులను నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.