ఆదిలాబాద్: పుర బరిలో 23 ఏళ్ల యువతి.. 75 ఏళ్ల వృద్ధురాలు

0చూసినవారు
ఆదిలాబాద్: పుర బరిలో 23 ఏళ్ల యువతి.. 75 ఏళ్ల వృద్ధురాలు
ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల వయస్సు ఇప్పుడు చర్చనీయాంశమైంది. మొత్తం 49 వార్డులకు 314 మంది పోటీపడుతుండగా, మెజారిటీ అభ్యర్థులు 40 ఏళ్ల లోపు వారే ఉండటం విశేషం. 9వ వార్డులో బీఆర్ఎస్ నుంచి 23 ఏళ్ల యువతి అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, 7వ వార్డులో 75 ఏళ్ల వృద్ధురాలు స్వతంత్ర అభ్యర్థిగా సవాల్ విసురుతున్నారు. యువత ఉత్సాహం, వృద్ధుల అనుభవం మధ్య ఈ ఎన్నికలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.