ఆదిలాబాద్: రవాణా శాఖ ఆధ్వర్యంలో 2కే రన్

1చూసినవారు
జిల్లా ఉప రవాణా కమిషనర్ రవీందర్ కుమార్ మాట్లాడుతూ, వాహనదారులు తమ ప్రాణ రక్షణ కోసమే రహదారి నిబంధనలు పాటించాలని సూచించారు. శనివారం జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. ఆదిలాబాద్ ఆర్టీఓ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. నెలరోజులపాటు రోడ్డు భద్రత నియమాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్