బడ్జెట్ సమావేశంలో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కొట్నాక్ సక్కు డిమాండ్ చేశారు. విద్యారంగానికి అధిక నిధులు కేటాయించేలా అసెంబ్లీలో ప్రస్తావించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ను కోరారు. విద్యారంగ సమస్యలపై ఎమ్మెల్యేకు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రియింబర్స్‌మెంట్, స్కాలర్షిప్‌లు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.