ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. స్థానిక టీటీడీసీ కేంద్రంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో మొత్తం 8 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వీరిలో బిఆర్ఎస్ పార్టీ నుండి నలుగురు, కాంగ్రెస్ పార్టీ నుండి ముగ్గురు, బిజెపి నుండి ఒక అభ్యర్థి నామినేషన్ వేశారు. పలువురు అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సరిగా నింపకపోవడంతో వెనుదిరిగారు.