విద్యార్థులను చెడు వ్యసనాలకు దూరంగా ఉంచి, మంచి ఆరోగ్య అలవాట్లపై అవగాహన కల్పించేందుకు 'ఆరోగ్య పాఠశాల' కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ పథకంపై నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నాటికలు, ఉపన్యాసాలు ఆలోచింపజేశాయి. అనంతరం ప్రతిభ కనబరిచిన 'స్టూడెంట్ ఛాంపియన్ల'కు కలెక్టర్ ప్రశంసా పత్రాలు అందజేశారు.