నీళ్లలో కొట్టుకుపోయే లేదా మునిగిపోతున్న వ్యక్తులను ఒడ్డుపై నుంచే కాపాడే పరికరం ఆదిలాబాద్ జిల్లాలో అందుబాటులోకి వచ్చింది. రెస్క్యూ కంట్రోల్ రిమోట్ లైఫ్ బాయ్ పేరుతో పిలిచే ఈ పరికరం ఎస్డీఆర్ఎఫ్ చేతిలో ఉంది. ఆదిలాబాద్ జిల్లా ఫైర్ సేఫ్టీ అధికారులు బుధవారం మావల చెరువులో మాక్ డ్రిల్‌ను నిర్వహించారు. ప్రమాదవశాత్తు ఎవరైనా నీటిలో పడితే ఈ పరికరాన్ని నీటిలోకి పంపిస్తారు. దాన్ని పట్టుకుని బాధితుడు ఒడ్డుకు చేరుతాడు.