ఆదిలాబాద్: పరారీలో ఉన్న నిందితుడు అరెస్ట్

50చూసినవారు
ఆదిలాబాద్: పరారీలో ఉన్న నిందితుడు అరెస్ట్
బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తున్న ఆదిలాబాద్‌కు చెందిన సుధీర్‌ని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ జీవన్‌రెడ్డి తెలిపారు. ఇటీవల కేసులో సుధీర్ పరారీలో ఉండగా, ఆదివారం ఆయనను మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా ఆళ్లపల్లిలో అదుపులోకి తీసుకున్నామన్నారు. ఇతడిపై పలు కేసులు ఉన్నాయని వెల్లడించారు. నిందితుడి నుంచి తల్వార్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇతడిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్