ఆదిలాబాద్: తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలి

55చూసినవారు
ఆదిలాబాద్: తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలి
ఇటీవల వరంగల్ లో నిర్వహించిన బీసీ సభలో రెడ్డి కులాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని జైనథ్ మండల రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. ఈ విషయమై బుధవారం పోలీస్ స్టేషన్లో ఎస్సై పురుషోత్తం ను కలిసి మల్లన్నపై ఫిర్యాదు చేశారు. తీన్మార్ మల్లన్న తీవ్ర పదజాలంతో రెడ్డి కులాన్ని దూషించడాన్ని తీవ్రంగా ఖండించారు.