ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న నిల్వలు పేరుకుపోవడంతో స్థలం కొరత ఏర్పడిందని, దీనివల్ల జొన్న పంటను యార్డుకు తీసుకురావడం కష్టమని సెంటర్ ఇన్‌ఛార్జ్ తెలిపారు. ప్రస్తుత వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని, రైతులు జొన్న పంటను మార్కెట్ యార్డుకు తీసుకువచ్చి ఇబ్బందులు పడకూడదని సూచించారు. తదుపరి షెడ్యూల్ ప్రకారం, గ్రామాల వారీగా నిర్ణయించిన తేదీలలో పంటను మార్కెట్ యార్డుకు తీసుకురావాలని కోరారు.