బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ ఫౌండేషన్ కోర్సుల ఉచిత శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థులు ఈ నెల 9లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ బీసీ అభివృద్ధి అధికారి రాజలింగు, స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ తెలిపారు. 4నెలల ఉచిత శిక్షణ, బుక్ ఫండ్, ప్రతినెల స్టైఫండ్ ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు https: //www. tgbcstudycircle. cgg. gov. in వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.