ఆదిలాబాద్: వైద్య పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
By asmath 84చూసినవారుఆదిలాబాద్ రిమ్స్‌లో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రతిపాదికన భర్తీ చేయుటకు అర్హులైన వైద్యుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు బుధవారం డైరెక్టర్ జైసింగ్ తెలిపారు. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ట్యూటర్స్, సీనియర్ రెసిడెంట్స్, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, సీఎంఓ పోస్టులు ఉన్నాయన్నారు. ఈనెల 18న ఇంటర్వ్యూలు ఉంటాయని, వివరాలకు rimsadilabad. org వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.