ఆదిలాబాద్: దివ్యాంగుల నుండి దరఖాస్తు ఆహ్వానం

82చూసినవారు
ఆదిలాబాద్: దివ్యాంగుల నుండి దరఖాస్తు ఆహ్వానం
వికలాంగుల ఉపాధి, పునరావాస పథకం కింద బ్యాంకు లింకేజీతో రూ. లక్ష నుంచి రూ. 3 లక్షలు బ్యాంకు లింకేజీ లేకుండా రూ. 50 వేల సబ్సిడీతో రుణాలు అందుబాటులో ఉన్నట్లు ఆదిలాబాద్ డిడబ్ల్యుఓ మిల్కా తెలిపారు. 2025-26 సంవత్సరానికి జిల్లాకు 22 యూనిట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ఆన్‌లైన్ ద్వారా జరుగుతుందన్నారు. https: //tgobmms. cgg. gov. in/ వెబ్ సైట్‌లో ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్