ఆదిలాబాద్ ప్రభుత్వ డైట్ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక పోస్టులను తాత్కాలిక విధానం ద్వారా భర్తీ చేస్తున్నట్లు, అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రవీందర్ రెడ్డి గురువారం తెలిపారు. ఈనెల 19లోపు అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించాలన్నారు. ఈ నెల 21న తుది జాబితా ప్రకటన, 24 నుంచి 26వ తేదీ వరకు ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. ఎంపికైన అభ్యర్థులు జూలై 1న రిపోర్ట్ చేయాలన్నారు.