రూరల్ డెవలప్మెంట్ క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ అనే పేరుతో ప్రజల వద్ద రూ. 25 వేలు తీసుకొని రూ. 2 లక్షల రుణం ఇప్పిస్తామని మోసం చేసిన ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో ఆదిలాబాద్ భుక్తాపూర్‌లోని సొసైటీలో రమేశ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు వన్ టౌన్ సీఐ సునీల్ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ప్రజలు ఎవరైనా ఇలాంటి మోసానికి గురైనట్లయితే నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు.